తెలంగాణ, ఏపీ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

11:10 February 17
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉపసంఘం భేటీ
Telangana-AP bifurcation Issues Subcommittee Meet : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం... తొలిసారిగా ఇవాళ భేటీ అయింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ సమావేశానికి.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హాజరయ్యారు. ఇవాళ ఉదయం11 గంటలకు దృశ్యమాధ్యమం ద్వారా భేటీ ప్రారంభమైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా 5 అంశాలను సమావేశ అజెండాలో చేర్చిన ఉపసంఘం... ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సివిల్ సప్లయ్ ఆర్థిక అంశాలపై చర్చిస్తారు. ఏపీ జెన్‌కో సంస్థకు తెలంగాణ డిస్కంల బకాయిలు... పన్నుల విధానం, బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాల అంశాలు కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:Revanth Reddy Arrest : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్