తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఏపీ సరిహద్దులోనే అధికం - heavy increase in sales of liquor

తెలంగాణలో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలలుగా నెలకు రూ. రెండు నుంచి రెండున్నర వేల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో ఈ మద్యం అమ్మకాలు మరింత పెరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

telangana alocohol sales increased due to prohibition in Andhra Pradesh state
రాష్ట్రంలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఏపీ సరిహద్దులోనే అధికం

By

Published : Oct 27, 2020, 9:36 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌తో మార్చి చివరి వారంలో మూతపడ్డ మద్యం దుకాణాలు మే 6న తిరిగి తెరచుకున్నాయి. యాభై రోజులకుపైగా మూతపడ్డ మద్యం దుకాణాలు తెరుచుకోగా మందుబాబులు ఎగిరి గంతేశారు. పీకలదాకా తాగేస్తున్నారు. రోజుకు రూ.50 నుంచి 60 కోట్లు మేర అమ్మకాలు జరిగే మద్యం.. ఇటీవల రూ. వంద కోట్లు అంతకు మించి కూడా జరుగుతున్నాయి. సాధారణ రోజుల కంటే వారాంతాల్లో ఈ అమ్మకాలు అధికంగా ఉంటున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.

2020లో మద్యం అమ్మకాలు
నెల అమ్మకాలు (రూ. కోట్లలో)
మే 2,270
జూన్ 2,391
జులై 2,507
ఆగస్టు 2,397
సెప్టెంబర్ 2,235
అక్టోబర్​ 26 వరకు 2,100

ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటం, అలవాటు పడ్డ బ్రాండ్లు దొరక్కపోవడం వల్ల రాష్ట్రంలో లభ్యమవుతున్న మద్యాన్ని అక్రమంగా తీసుకెళ్లుతున్నారు. ఇలా తెలంగాణ నుంచి తీసుకెళ్లుతున్న మద్యాన్ని ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఏపీ సెబ్‌ అధికారులు సరిహద్దుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో కాకుండా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాల్లో కూడా లిక్కర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి అడ్డదారుల్లో ఏపీకి చేరవేస్తున్నారు. కొందరైతే సెబ్‌ అధికారుల కళ్లుగప్పేందుకు సైకిళ్ల మీద కూడా మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు.

మే 6- అక్టోబర్ 26 వరకు జరిగిన అమ్మకాలు (రూ. కోట్లలో)
2019 2020
మొత్తం 9,975.58 13,910.00
ఉమ్మడి మహబూబ్​నగర్ 667 1,099
ఉమ్మడి ఖమ్మం 604 1,072
ఉమ్మడి నల్గొండ 1,019 1,618

రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాలు ఇదే ఊపుతో కొనసాగినట్లయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 25 నుంచి 28వేల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండిఃవైన్ షాప్​ల వద్ద కరోనా అలర్ట్..క్యూ కోసం ప్రత్యేక గడులు

ABOUT THE AUTHOR

...view details