తెలంగాణ

telangana

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దిగుబడులు

తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకలితీర్చే అన్నపూర్ణగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనాలు తాజా నివేదికలో వెల్లడించింది. తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నామని చెప్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనం అని చెప్పక తప్పదు.

By

Published : Feb 10, 2020, 12:38 PM IST

Published : Feb 10, 2020, 12:38 PM IST

telangana agriculture situation latest news
telangana agriculture situation latest news

రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, దిగుబడి పెరుగనుందని అర్థ,గణాంకశాఖ మందస్తు అంచానాలను తాజా నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ సంవత్సరం రెండు సీజన్లు వానాకాలం(ఖరీఫ్‌), రబీ(యాసంగి) కలిపిలో 1.30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు రానున్నాయి.

వరి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల.. గతేడాదికన్నా 40.17 శాతం అధిక దిగుబడులు నమోదయ్యాయి. వరి సాగు విస్తీర్ణం 48.08, మొక్కజొన్న 22.91, సెనగ 7.81 శాతం పెరగడం వల్ల రాష్ట్ర ఆహార ధాన్యాల దిగుబడుల రికార్డులన్నీ పెరిగాయి.

వరి.. సరికొత్తగా...

రాష్ట్రంలో వరి పంట సాగు కొంత పుంతలు తొక్కుతోంది. 2014-15లో కేవలం 34.96 లక్షల ఎకరాల్లో సాగవ్వగా ఈ ఏడాది అంతకన్నా 100 శాతం పెరిగి 68.50 లక్షల ఎకరాలకు చేరింది. సాగునీటి లభ్యత పెరగడం వల్ల అదనపు విస్తీర్ణంతో పాటు ఇతర పంటల నుంచి వరి సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. వరిధాన్యం దిగుబడి 2016-17లో తొలిసారి కోటి టన్నులు రాగా ఈ ఏడాది అంతకన్నా 48.08 శాతం అదనంగా పెరిగి 1.48 కోట్ల టన్నులకు చేరనుంది. కంది, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుసెనగ సాగు ఈ ఏడాది పెరగలేదు.

నూనెగింజల పంటలన్నీ కలిపి చూస్తే 2016-17లో 7.22 లక్షల టన్నులొస్తే ఈ ఏడాది అంతకన్నా 58 వేల టన్నులు తగ్గడం గమనార్హం. పత్తి పంట గతేడాదికన్నా స్వల్పంగా పెరిగింది. వాస్తవానికి 2017-18లోనే రాష్ట్రంలో పత్తి దిగుబడి 51.95 లక్షల బేళ్లు రాగా ఈ ఏడాది అంతకన్నా 3.33 లక్షల బేళ్లు తగ్గడం గమనార్హం. బేలు అంటే 170 కిలోల పత్తి. ఈ పంట రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది 52.24 లక్షల ఎకరాల్లో వేశారు. సాగు విస్తీర్ణంతో కొత్త రికార్డు నమోదైనా దిగుబడిలో రికార్డులేమీ లేవు.

రాష్ట్రంలో పంటల దిగుబడుల తీరు(లక్షల టన్నులు)

పంట 2014-15 2019-20
బియ్యం 45.45 98.74
మెుక్కజొన్న 23.08 25.59
కంది 1.09 2.07
పెసర 0.45 0.48
మినుము 0.16 0.18
సెనగ 0.81 1.89
పప్పు ధాన్యాలు 2.63 4.67
నూనె గింజలు 6.29 6.64
పత్తి 35.83 48.62

ఇవీ చూడండి:కృష్ణమ్మపై మరో జలాశయానికి సర్కారు కసరత్తు

ABOUT THE AUTHOR

...view details