Telangana Agriculture Development Report 2023 :రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి సర్కారు అహర్నిశలు కృషిచేస్తోంది. బీడుబారిన వ్యవసాయ భూమికి ప్రభుత్వం కల్పించిన సాగు నీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని.. వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ప్రగతి నివేదికనుప్రభుత్వం విడుదల చేసింది.
Telanagna Decade Celebrations 2023 :రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి కోటి ఎకరాలకు పైగా సాగు నీరు ఇచ్చినట్లు వివరించింది. సాగు విస్తీర్ణణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచినట్లు తెలిపింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది.
- TELANGANA FORMATION DAY 2023 : జూన్ 2న కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
- Telangana Formation Day 2022: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. చిత్రమాలిక
నేరుగా రైతుల ఖాతాల్లో : దేశంలో వినూత్న ఒరవడితో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించినట్లు వివరించింది. ఏడాదికి 65 లక్షల మంది రైతులకు 10 వేలు పంటపెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు గుర్తుచేసింది. 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు 10 సీజన్లలో.. ఏకంగా 65,192 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంత భారీ మొత్తం రైతుల ఖాతాల్లో జమచేసినఏకైకప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని పేర్కొంది.
రైతు వేదికలు :రైతులు ఆత్మగౌరవం చాటేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలు నిర్మించింది. ఆ రైతు వేదికలు వ్యవసాయ ప్రగతి దీపికలై రైతులకు మార్గదర్శనం చేస్తున్నాయని పేర్కొంది. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టమని తెలిపింది.