ఆదివారం దేశవ్యాప్తంగా జరగనున్న జనతా కర్ఫ్యూను రాష్ట్రంలోనూ విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పిలుపుతో తాను సైతం ఇందులో పాల్గొంటున్నానని... ప్రజలంతా కర్ఫ్యూ పాటించాలని మంత్రి కోరారు.
'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం' - Corona Virus Latest News
కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా జనతా కర్ఫ్యూను జయప్రదం చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం రేపటి స్వీయ నియంత్రణను విజయవంతం చేయాలని జనాలను కోరారు.
Minister Niranjan Reddy
ఈ మేరకు మంత్రి ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని మనం రక్షించుకోవడానికి... రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: హెచ్ఆర్సీలో కేసుల విచారణ వాయిదా