తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు దేశానికే ఆదర్శం... ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: మంత్రి - రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ

రైతుబంధు పథకం అమలులో వ్యవసాయ శాఖ ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 48 గంటల వ్యవధిలో 6886.19 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.... రైతుబంధు నిధుల జమ: నిరంజన్​ రెడ్డి
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.... రైతుబంధు నిధుల జమ: నిరంజన్​ రెడ్డి

By

Published : Jun 24, 2020, 5:39 PM IST

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఏకకాలంలో పెద్ద ఎత్తున రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమచేసి వ్యవసాయ శాఖ సరికొత్త రికార్డు సృష్టించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. మొత్తం 54.21 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించగా... ఇందులో 74,084 మంది ఆర్ఓఎఫ్ఆర్ ( ఏజెన్సీ ఏరియా ఎస్టీ రైతులు ) పట్టాదారులకు 124.23 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకున్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేశామని పేర్కొన్నారు. జనవరి నుంచి జూన్ 16 వరకు పాసు పుస్తకాలు అందిన రైతులు సంబంధిత ఏఈవోల వద్ద బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతుబంధు నిధులు జమకాని రైతుల సందేహాలు క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని ఆదేశించారు. రైతుబంధు అమలులో ఎటువంటి ఆంక్షలు లేవని తేల్చిచెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహం, చిత్తశుద్ధికి నిదర్శనం.... రైతుబంధు నిధుల జమ అని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్​కు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details