తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి - కేంద్రంపై ఫైర్​ అయిన మంత్రి నిరంజన్​రెడ్డి

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కడం బాధకరమని వెల్లడించారు. రైతుల డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి

By

Published : Dec 23, 2020, 2:19 PM IST

ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కి నిరసన తెలపడం బాధాకరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.... కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు రైతుల సూచించిన మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎముకలు కొరికే చలిలోనూ దిల్లీ పరిసరాల్లో పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, మహారాష్ట్ర రైతులు ఆందోళనలను చేస్తున్నారన్నారు. రైతుల డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 41 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ దమనకాండలో గాయపడ్డారని వివరించారు. దేశవ్యాప్తంగా 50 రైతు సంఘాలు, వేల సంఖ్యలో ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు మద్దతుగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజలు రైతులకు మద్దతు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం దేశానికి మంచిది కాదన్నారు.

దేశంలో 55 శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించే అంశాన్ని చట్టంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మద్దతుధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత తీసుకురావడంతో పాటు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయడం వంటి రైతుల డిమాండ్లను కేంద్రం బేషరతుగా అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

ABOUT THE AUTHOR

...view details