తెలంగాణ

telangana

ETV Bharat / state

దరఖాస్తు సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా - అయితే మీకు పింఛన్ రాదు! - ఆసరా పింఛన్ దరఖాస్తు విధానం

Aasara Pension Avoid These Mistakes While Applying : 'ఆసరా' పేరుతో.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు.. ఇలా పలు వర్గాల వారికి తెలంగాణ సర్కార్ పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా పింఛన్ పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. ఈ పింఛన్ దరఖాస్తు సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల.. అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడంతో వారు అనర్హులుగా మిగిలిపోతున్నారు. మరి, ఇంతకీ దరఖాస్తు ఎలా చేయాలి? అప్లికేషన్​ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Aasara Pension
Aasara Pension Avoid These Mistakes While Applying

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 9:52 AM IST

Aasara Pension Avoid These Mistakes While Applying : తెలంగాణ ప్రభుత్వం పలు వర్గాల వారికి ఆసరా పింఛన్ అందిస్తోంది. అయితే.. ఈ పింఛన్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారు.. తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దాంతో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఫలితంగా.. ఈ స్కీమ్​కి అవసరమైన అర్హతలు ఉన్నప్పటికీ.. పింఛను పొందలేక పోతున్నారు. మరి, ఆసరా పింఛన్(Aasara Pension Scheme) పొందడానికి​ ఉండాల్సిన అర్హతలు ఏంటి..? దరఖాస్తుకు ఏయే పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆసరా పింఛను అర్హతలివే (Eligibility for Aasara Pension in Telangana) :

  • వృద్ధాప్య పింఛన్ దరఖాస్తుదారు 57 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • వితంతువు పింఛన్ పొందడానికి దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
  • చేనేత, గీత, బీడీ మొదలైన కార్మికుల వయస్సు 50 ఏళ్లు పైబడి ఉండాలి.
  • దివ్యాంగులు ఏ వయసు వారైనా ఈ స్కీమ్​కి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పింఛన్ పొందడానికి కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు.

అసరమైన పత్రాలు (Required Documents For Aasara Pension) :

  • ఆధార్ కార్డు
  • ఇంటి చిరునామా పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • వయస్సు ధ్రువీకరణ పత్రం
  • వితంతువైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  • చేనేత, బీడీ కార్మికులైతే.. సహకార సంఘం రిజిస్ట్రేషన్ జీరాక్స్ కాపీ
  • బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
  • పోస్టాఫీస్ సేవింగ్ ఖాతా
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
  • మొబైల్ నంబర్

ఎలా దరఖాస్తు చేయాలి (How To Apply for Telangana Aasara Pension) :

ఆసరా పింఛన్ కోసం ఆఫ్​లైన్​ లేదా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. గతేడాది సెప్టెంబర్​ వరకూ https://www.aasara.telangana.gov.in/ అధికారిక వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్​లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించట్లేదు. (భవిష్యత్తులో ఆన్​లైన్​ అవకాశం ఇస్తారేమో). ప్రస్తుతం ఆఫ్ ​లైన్​లో అప్లై చేయాలనుకున్న లబ్ధిదారులు.. మీసేవ కేంద్రం నుంచి అప్లికేషన్ ఫాం తీసుకోవాలి. ఆ తర్వాత అందులో అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేసి.. అలాగే అవసరమైన డాక్యుమెంట్ల అటాచ్ చేసి సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి. అప్పుడు అధికారులు వేరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

Telangana Single Women Pension Scheme : ఒంటరి మహిళలకు పింఛన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా..?

ఆసరా ఫించన్ దరఖాస్తు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలివే..

  • దరఖాస్తు దారు అప్లికేషన్ ఫాం నింపేటప్పుడు దానికి అటాచ్ చేస్తున్న గుర్తింపు కార్డులో ఉన్నట్టుగా అందులో పేరు నమోదు చేయాలి. తప్పుగా రాస్తే.. ఇబ్బందులు తప్పవు.
  • ఇంటిపేరు తప్పుల్లేకుండా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అదే ఇంటిపేరుతో ఒకే పేరు గల వ్యక్తులు అప్లై చేసినప్పుడు మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది.
  • వృద్ధుల పింఛన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు వయస్సు ప్రామాణికం. కాబట్టి దరఖాస్తు ఫాంకు అటాచ్ చేసిన గుర్తింపు కార్డులో ఉన్న విధంగా వయస్సు నమోదు చేశారో లేదో చెక్ చేసుకోవాలి.
  • చేనేత, బీడీ కార్మికులైతే.. ఆయా సహకార సంఘాలు జారీ చేసిన రిజిస్ట్రేషన్ కాఫీలో ఉన్నట్టుగా వివరాలు నమోదు చేశారో లేదో చెక్ చేసుకోవాలి.
  • కొంతమంది ఏదో ఒక అడ్రస్ పెట్టి అప్లై చేస్తుంటారు. దానివల్ల వెరిఫికేషన్ టైమ్​లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
  • అదేవిధంగా బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
  • అలాగే అప్లికేషన్ టైమ్​లో సరైన మొబైల్ నంబర్(Mobile Number)ఇవ్వాలి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ ప్రక్రియ వివరాలు ఎప్పటికప్పుడు మెసేజ్​ రూపంలో మీ ఫోన్​కు వస్తాయి.
  • వివరాలన్నీ ఎంటర్​ చేసిన తర్వాత.. మరొక్కసారి పరిశీలించి.. అంతా కరెక్టుగా ఉన్నాయనుకున్న తర్వాతే సమర్పించాలి.

How To Choose Best Pension Plan For Retirement : రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలా?.. సరైన పింఛన్​ ప్లాన్​ రెడీ చేసుకోండిలా!

NPSలో చేరితే దిల్​ఖుష్​ రిటైర్మెంట్.. ట్యాక్స్ బెనిఫిట్స్.. సూపర్ రిటర్న్స్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details