Dalit Bandhu 2nd Phase from October 2 :రాష్ట్రంలో రెండో విడత దళితబంధు పథకం(Dalit Bandhu) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఆశావహుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలన మొదలైంది. అందులో ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేయాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో దళితబంధు కోసం భారీగానే దరఖాస్తులు వచ్చి.. వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎమ్మెల్యేల ఆమోదంతో అర్హుల జాబితాను ఎస్సీ కార్పొరేషన్(SC Corporation)కు అందించేందుకే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 72 నియోజకవర్గాలలో 50 వేల దరఖాస్తులు పరిశీలన జరుగుతోందని అధికారులు తెలుపుతున్నారు.
Dalit Bandhu Scheme in Telangana :తొలివిడత 38వేల 323 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేసిన సర్కారు రూ.4,441.80 కోట్లను ఖర్చుచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసింది. రెండోవిడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా 1,30,000 కుటుంబాలకు పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైనా.. కొన్ని జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాల్లో పూర్తయింది. గ్రామాలవారీగా అర్హులైన దళిత కుటుంబాలతో జాబితాకు ఎమ్మెల్యేల ఆమోదం అనంతరం.. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. ప్రస్తుతం 72 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలుకాగా.. మిగతా నియోకవర్గాల్లో త్వరలో ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల జాబితాలు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి చేర్చేలా అధికారులు పనిచేస్తున్నారు.
Dalit Bandhu In Telangana : దళితబంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి