28 కార్పొరేషన్లను లాభదాయక పదవుల నుంచి మినహాయింపు - 28 corporations latest news
16:19 December 04
28 కార్పొరేషన్లను లాభదాయక పదవుల నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ
రాష్ట్రంలో మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరికొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మరో 28 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వేతనాలు, పింఛన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపుల చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. రైతు సమన్వయ సమితి, మూసీతీరప్రాంత అభివృద్ధి సంస్థ సహా ఇతర కార్పొరేషన్ పదవులు ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్డినెన్స్ జారీతో కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు త్వరలోనే కార్పొరేషన్ పదవులు దక్కనున్నాయి.
ఇవీ చూడండి: 'డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాదే హబ్'