Funding for metro rail in Telangana budget: 2023-24 తెలంగాణ బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖ, సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు.. ఐటీ రంగంతో పాటుగా.. మెట్రో రైలు అభివృద్దికి భారీగా నిధులు మంజూరు చేసింది. ఈసారి మెత్తం బడ్జెట్లో మెట్రో రైలు కోసం రూ.1500కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో పాతబస్తీలో ట్రాక్ నిర్మాణం, వసతుల కోసం రూ.500 కోట్లు కేటాయించింది.
Allocations in the budget for infrastructure development: రాజధాని నగరంలో మౌలిక వసతులను మెరుగు పరచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో 31 పూర్తి చేయటం జరిగిందని.. మిగతా 11 ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేస్తామని మంత్రి శాసనసభలో ప్రకటించారు.
ఇప్పటికే రూ.275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపిన మంత్రి హరీశ్‌రావు.. దీనివల్ల ప్రయాణ దూరం, ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యం తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. రూ. 76.65 కోట్లతో చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో 9 వంతెనలు పూర్తయ్యాయని.. మిగతా వాటి పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రకటించారు.