తెలంగాణ

telangana

ETV Bharat / state

Nature: ప్రకృతితో స్నేహం చేయాలి: సందీప్ పట్నాయక్ - ప్రకృతి వ్యవస్థ పునరుద్ధరణపై తెలంగాణ ఫిక్కీ వీడియో కాన్ఫరెన్స్

పౌరులందరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని తెలంగాణ ఫిక్కి కో ఛైర్మన్ సందీప్ పట్నాయక్ అన్నారు. మనిషికో మొక్కను పెంచుతూ... దానితో స్నేహం చేస్తే ప్రకృతిపై ప్రేమ పెరుగుతుందని తెలిపారు.

telangan ficci video conference for Ecosystem Restoration
Nature: ప్రకృతితో స్నేహం చేయాలి: సందీప్ పట్నాయక్

By

Published : Jun 19, 2021, 12:13 PM IST

పర్యావరణ సమతుల్యతకు మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ఫలితాలను ఇస్తాయని.. తెలంగాణ ఫిక్కి కో ఛైర్మన్ సందీప్ పట్నాయక్ అన్నారు. పర్యావరణ వ్యవస్థ పునరుద్దరణ పేరుతో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్​లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో స్నేహం చేయడం అలవరుకోవాలని... మన చుట్టూ ఉండే పరిసరాలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని సందీప్ పట్నాయక్ తెలిపారు.

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా... వ్యాపార కార్యకలాపాలు సాగించాలన్నా పర్యావరణ పాత్ర ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థలు వాటి ప్రయోజనాల గురించి ఆలోచించే ప్రతీ సారి పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, పరిశోదనా సంస్థ డైరెక్టర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్ సిన్హా, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details