రాష్ట్రంలో వెంటనే మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళా సంఘాల సమాఖ్య సమితి.. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేసింది. కమిషన్ లేకపోవడం వల్ల మహిళల సమస్యలు పరిష్కారం కావడం లేదని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఎక్కడ.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని సమాఖ్య ప్రతినిధి సత్యవతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
'మహిళా కమిషన్ ఏర్పాటు చేయాల్సిందే' - MAHILALA PROBLEMS
ప్రతీ మహిళా.. పురుషుల చేతిలో ఎన్నో కష్టాలు అనుభవిస్తోందని, అలాంటి సమస్యలు తీర్చాలంటే కచ్చితంగా మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళా సంఘాల సమాఖ్య సమితి డిమాండ్ చేసింది.

'మహిళా కమిషన్ ఏర్పాటు చేయాల్సిందే'
Last Updated : May 30, 2019, 7:54 AM IST