హైదరాబాద్లో కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్ననిరుపేద ప్రజలకు హైదరాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కో-కన్వీనర్ తేజా చౌదరీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ ఏరియా వెనుక భాగంలోని పలు బస్తీల్లో రెండు వందల మందికి బియ్యం, నూనె, పప్పులను అందజేశారు.
నిరుపేదలకు సరుకులు అందించిన జాగృతి నాయకులు - telanagana jagtuti leaders distributed daily commodities
కరోనా కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ఆదేశాల మేరకు జాగృతి నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తేజా చౌదరి వివరించారు. అలాగే గల్ఫ్ దేశాలలో తీవ్ర ఇక్కట్లు పడుతున్న తెలుగు వారిని కూడా ఆదుకుంటున్నట్లు వివరించారు. కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోయేవరకూ ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు వాడాలని సూచించారు.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'