తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ - గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

పదో తరగతి విద్యార్థులు సాంఘిక, గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్​ను జారీ చేసింది. ఆసక్తి గల విద్యార్థులు రేపటినుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

TELANAGANA GURUKUL COE COLLEGES NOTIFICATION
గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

By

Published : Nov 27, 2019, 8:27 PM IST

సాంఘిక, గిరిజన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రేపటి నుంచి డిసెంబరు 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో కేవలం గిరిజన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్​తోపాటు.. జేఈఈ, నీట్, సీఏ, క్లాట్, తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు.



ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details