వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒప్పంద, పొరుగు సేవల విభాగంలో గౌరవవేతనంతో 7180 పోస్టుల్లో తాత్కాలిక నియామకాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్యులు, సిబ్బందిని గతంలోనే తాత్కాలిక పద్ధతిన నియమించారు. ఆ నియామకాలను కొనసాగించేందుకు అనుమతిచ్చారు.
మరో ఏడాదిపాటు కొనసాగింపునకు అనుమతి - తాత్కాలిక నియామకాలు కొనసాగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
వైద్య, ఆరోగ్య శాఖలో ఒప్పంద, పొరుగుసేవల పద్ధతి, గౌరవవేతనంతో ఉన్న పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కొనసాగింపునకు మరో ఏడాది పాటు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గౌరవవేతనంతో 7180 పోస్టుల్లో తాత్కాలిక నియామకాలు కొనసాగనున్నాయి.
మరో ఏడాదిపాటు కొనసాగింపుకు అనుమతి
అటు కొవిడ్ సేవల కోసం వివిధ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1191 మంది వైద్యులు, సిబ్బంది సేవలు కూడా కొనసాగించనున్నారు. మొత్తం 1237 మంది ఒప్పంద పద్ధతిన, 4269 మంది పొరుగుసేవల విధానంలో... 1674 మంది గౌరవవేతనంతో కొనసాగనున్నారు. ఏడాది కాలానికి నియామకాలు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి:నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత