మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన ఫిర్యాదులు, విచారణ కోసం అన్ని జిల్లాల్లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్సమెన్లుగా నియమించాల్సి ఉంటుంది.
ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్ - ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్
ఉపాధిహామీ పనుల ఫిర్యాదులు, విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్స్‌మెన్‌గా నియమించనుంది.
ఉపాధి హామీ ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మెన్
రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాలకు అంబుడ్స్‌మెన్ నియమించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.