రాష్ట్రంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అత్యవసరమని పలువురు నేతలు... ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వద్ద తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆజాద్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, హనుమంతరావు, గీతారెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కలిసి తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు గురించి వివరించారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, హుజూర్నగర్ ఉప ఎన్నికలలో పార్టీ గెలుపోటముల గురించి తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం తొలిగించేందుకు త్వరితగతిన నూతన పీసీసీ సారథిని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్ని విషయాలను సావధానంగా విన్న ఆజాద్... ఏఐసీసీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని ఆజాద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
'నూతన టీపీసీసీ సారథిని ఎంపిక చేయండి ' - ghulam nabi azad hyderabad tour today news
తెలంగాణలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అత్యవసరమని పలువురు నేతలు... ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వద్ద తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
!['నూతన టీపీసీసీ సారథిని ఎంపిక చేయండి '](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4970764-755-4970764-1572963987272.jpg)
congress leader ghulam nabi azad hyderabad tour today news
TAGGED:
TPCC today news