తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh immersion: పొరుగు రాష్ట్రాల నుంచి తీన్​మార్​ బాజాలు - Ganesh immersion 2021

ఉత్సవాలు ఉత్సాహాన్నే కాదు... ఉపాధిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా వినాయక చవితి. నవరాత్రోత్సవాలు ఒకెత్తయితే.. నిమజ్జనోత్సవం మరో ఎత్తు. ఆ రోజు ఉండే సంబురాలు అన్ని ఇన్ని కాదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తీన్​మార్​ గురించి. ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం నింపి రెట్టింపు ఉత్సాహాన్నిస్తాయి.

Ganesh immersion
Ganesh immersion

By

Published : Sep 15, 2021, 9:20 AM IST

గరంలో గణపతి నవరాత్రోత్సవాలు ఒకెత్తయితే.. నిమజ్జనోత్సవం మరో ఎత్తు. ఆ రోజు సంబరాలు అంబరాన్నంటుతాయి. ఏటా ఉన్న సందడే అయినా.. ఏ ఏటికాయేడే కొత్త ఉత్సాహాన్ని గణేష్‌ ఉత్సవాలిస్తాయి. ముంబయి తర్వాత నగరంలోనే అంత ఘనంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాన్ని తిలకించడానికి లక్షలాది మంది వస్తారు. అక్కడ వివిధ రూపాల్లో ఉన్న గణపతి ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. ఇక తీన్‌మార్‌ డప్పులు.. రెట్టించిన ఉత్సాహాన్నిస్తాయి. దీని కోసం నగరానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా డప్పు వాయిద్యకారులు తరలివస్తున్నారు. నాందేడ్‌ నుంచి పదుల సంఖ్యలో బృందాలు నగరానికి చేరుకొన్నాయి.

సంతోషంగా మా ఊరెళ్తాం..

ఏటా నగరానికి వస్తున్నాం. గతేడాది కరోనాతో సందడి తక్కువైనా.. ఇక్కడకు వచ్చాం. ఈ ఏడాది బాగుంటుందని భావిస్తున్నాం. తీన్‌మార్‌ వాయిద్యకారులకు ఈ వారం రోజులు పండగే.. విగ్రహాలు మూడో రోజు నుంచే నిమజ్జనానికి తరలిస్తుంటారు. ఈ రోజుల్లో కాస్త తక్కువ మొత్తంలో డబ్బు తీసుకున్నా.. చివరి రోజు ఈ నెల 19న గంటల చొప్పున తీసుకుంటాం. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని మమ్మల్ని ఇక్కడికి రప్పించుకుంటారు. ఉండేందుకు, తినేందుకు ఏమాత్రం ఢోకా ఉండదు. వచ్చిన డబ్బుతో ఉత్సాహంగా ఊరెళ్లిపోతాం.

-సాయికుమార్‌, నాందేడ్‌

ఉత్సవమిస్తున్న ఉపాధి.. ఉత్సవాలు కొత్త జోష్‌నే కాదు.. ఉపాధినిస్తాయనడానికి గణపతి నిమజ్జనోత్సవాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాందేడ్‌, చత్తీస్‌గఢ్‌తో పాటు.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా నగరానికి తీన్మార్‌, ఇతర వాయిద్యకారులు చేరుకుంటున్నారు. ఇలా నాందేడ్‌ నుంచి నగరానికి చేరుకున్న ఓ బృందంలో 20 మంది కళాకారులు ఉన్నారు. తమ ప్రాంతం నుంచి 18 బృందాలు హైదరాబాద్‌ వచ్చాయని ఆ బృందసభ్యుడు సాయికుమార్‌ చెప్పారు. ఇక్కడికి వచ్చాక 5 మందితో ఒక బృందంగా ఏర్పడి ఊరేగింపులకు వెళ్తామన్నారు. గంటల చొప్పున.. ఊరేగింపు దూరాన్ని.. తీసుకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఛార్జీలు వసూలు చేస్తామని ఆ బృందం ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:Engineer's day: నవకల్పనలతోనే సరికొత్త జవజీవాలు..

ABOUT THE AUTHOR

...view details