తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుల మందు తాగి నటుడి నిరసన

ఓ యువకుడు తనకు అన్యాయం జరిగిందని.. గుర్తుతెలియని వ్యక్తులు తన సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్ చేసి రూ. 40 లక్షల వరకు నష్టాన్ని కలిగించారని వాపోయాడు. న్యాయం చేయాలంటూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

By

Published : Dec 11, 2019, 5:14 PM IST

teenaged-teenager-protesting-insecticide-drug-at-hyderbad
పురుగుల మందు తాగి యువకుడి నిరసన

గుర్తు తెలియని వ్యక్తులు తన సినిమాను యూట్యూబ్​లో అప్​లోడ్ చేసి రూ. 40 లక్షల మేర నష్టాన్ని కలిగించారని దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరగడం లేదని ఆవేదనతో హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద పురుగుల మందు తాగాడు.

నానిగాడు పేరుతో నిర్మించిన సినిమాకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేశాడు. ఆ చిత్రంలో నటించిన దుర్గాప్రసాద్ ఫిల్మ్ చాంబర్​కు చేరుకుని పురుగుల మందు సేవించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పురుగుల మందు తాగి యువకుడి నిరసన

ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్​ దాఖలు చేయండి: ఎన్జీటీ

ABOUT THE AUTHOR

...view details