తెలంగాణ

telangana

ETV Bharat / state

పనులు వేగవంతం చేయండి: పద్మారావు గౌడ్ - teegullapadmaarao goud inspection of the rain water canal

జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులను ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత అధికారులతో పనుల పురోగతి తెలుసుకున్నారు.

teegullapadmaarao goud inspection of the rain water canal construction works in  jaame osmania
పనులను వేగవంతం చేయండి: తీగుల్ల పద్మారావు గౌడ్

By

Published : Dec 30, 2020, 7:03 PM IST

హైదరాబాద్​లోని జమే ఉస్మానియా రైల్వే ట్రాక్ వద్ద నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ పనులను వేగవంతం చేయాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీ ..

బౌద్ధ నగర్ డివిజన్‌లో.. జీహెచ్ఎంసీ ద్వారా రూ. 37 లక్షల ఖర్చుతో జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో నిర్నిస్తున్న పనులను అయన ఆకస్మికంగా తనిఖి చేశారు. పనుల పురోగతి వివరాలపై సంబంధిత అధికారులతో సమీక్షించి .. వర్షపు నీరు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, తెరాస యువ నాయకుడు తీగుళ్ల కిరణ్ గౌడ్, జీహెచ్ఎంసీ ఈఈ లక్షణ్, తదితరవలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సీరం టీకా వినియోగంపై డీసీజీఐ నిర్ణయం అప్పుడేనా?

ABOUT THE AUTHOR

...view details