తెలంగాణ

telangana

ETV Bharat / state

మైత్రీవనంలో కొలువుదీరిన టెక్నికల్​ గణేషుడు - verity ganesh

కాదేదీ భక్తికనర్హం... ఏవైతేనేమి భగవంతుని రూపం అనుకున్నారు కొందరు యువకులు. కంప్యూటర్​ సాంకేతికతలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు టెక్నికల్​ గణేషుడిని ప్రతిష్ఠించారు. పాడైన కంప్యూటర్​ విడిభాగాలతో గణపతిని తయారు చేసి తమ ప్రతిభతో పాటు, భక్తిని చాటుకున్నారు.

మైత్రీవనంలో కొలువుదీరిన టెక్నికల్​ గణేషుడు

By

Published : Sep 2, 2019, 5:47 PM IST

Updated : Sep 2, 2019, 7:31 PM IST

హైదరాబాద్​ అమీర్​పేట మైత్రీవనంలో టెక్నికల్​ వినాయకుడు కొలువుదీరాడు. కంప్యూటర్​ సాంకేతికతలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాడైన కంప్యూటర్​ విడిభాగాలతో వినూత్నంగా గణనాథుడిని రూపొందించారు. స్థానికంగా ఉన్న హార్డ్​వేర్​ సాప్ట్​వేర్​ టెక్నికల్​ ట్రైనింగ్​ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తమదైన శైలిలో వినాయక విగ్రహం తయారు చేశారు.

వీటితోనే రూపొందించారు..

నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్​ విడిభాగాలతో వినాయకుడి తయారుచేయాలనే ఆలోచనతో 20 రోజుల పాటు శ్రమించి పార్వతీ సుతుడి ప్రతిమను రూపొందించారు. 150 మౌస్​లు, 60 కీబోర్డులు, రెండు మథర్​బోర్డులు, 8 ల్యాండ్​ టెస్టర్​లు, ల్యాప్​ట్యాప్​, మూడు సీపీయూలు, రెండు హార్డ్​ డిస్క్​లు ఉపయోగించి వినాయకుడిని రూపొందించారు.

తొమ్మిదేళ్లుగా వినాయకుడి ఉత్సవాలు చేస్తున్నామని ఈసారి వినూత్నంగా, పర్యావరణ హితంగా గణేషుడిని తయారుచేయాలనే ఉద్దేశంతో టెక్నికల్​ గణేషుడిని తయారు చేశామంటున్నారు విద్యార్థులు. ఆలోచనకు సాంకేతిక జోడించి.. దానిని బాధ్యతతో నెరవేర్చి భక్తిని చాటుకున్నారు విద్యార్థులు.

మైత్రీవనంలో కొలువుదీరిన టెక్నికల్​ గణేషుడు

ఇదీ చూడండి: అటు 'యాపిల్' గణేశుడు.. ఇటు 'బాదం' గణనాథుడు

Last Updated : Sep 2, 2019, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details