తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలు త్వరలో భర్తీ: సబితా - Sabitha indra reddy on Teaching vacancies

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు రాకుండా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలు త్వరలో భర్తీ: సబితా
విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలు త్వరలో భర్తీ: సబితా

By

Published : Mar 24, 2021, 9:57 PM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. పాఠశాలల ఫీజులపై తిరుపతిరావు కమిటీ సిఫార్సులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మార్చేందుకు బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు ప్రత్యేక నిధి కేటాయింపులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు రాకుండా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని సభ దృష్టికి తీసుకువచ్చారు. టీ శాట్ యాప్​ను 12 లక్షల మంది విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని మంత్రి తెలిపారు. 85 శాతం డిజిటల్‌ స్టడీని తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. గురుకులాలు ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో విద్యార్థులు దూసుకుపోతున్నారని మంత్రి తెలిపారు.

ఇవీచూడండి:పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్​వెజ్​ మార్కెట్: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details