Teaching Doctors Protest: రాష్ట్రంలో పూర్తి స్థాయి డీఎంఈ పదవిని సృష్టించి కొత్తవారిని ఆ స్థానంలోకి నియమించాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం ఎదుట అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు.
చాలా ఏళ్లుగా మా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. డీఎంఈ పోస్టు ఇప్పటివరకు క్రియేట్ చేయకుండా మా డీఎంఈ అడ్డుకున్నారు. మాకు ఇంతవరకు పీఆర్సీ సమస్యలు పరిష్కరించలేదు. చాలా మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. ఈ డీఎంఈ మాకు వద్దు. రెండు వేల మంది ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఐదేళ్లుగా డీఎంఈ పోస్టులో ఉంటూ ప్రశ్నించిన ఉద్యోగులను వేధిస్తున్నారు. - డాక్టర్ జలగం తిరుపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల అసోసియేషన్