తెలంగాణ

telangana

ETV Bharat / state

TRT: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిరాశ.. ఆ పరీక్ష ఇప్పట్లో ఉండదు! - trt 2021

ప్రభుత్వ ఉపాధ్యాయుల(GOVERNMENT TEACHERS) నియామకం కోసం నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ)TRT ఇప్పట్లో ఉండే అవకాశంలేదు. కొత్త జిల్లాల సంఖ్యను ఖరారు చేయాలని సర్కారు ఆదేశించినప్పటికీ... అధికారులు మాత్రం చిక్కులు వస్తాయని చెప్తుండటంతో ఇప్పట్లో టీఆర్టీ(TRT) ఉండదని తెలుస్తోంది.

teachers-recruitment-test-is-not-currently-possible
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిరాశ.. ఆ పరీక్ష ఇప్పట్లో ఉండదు!

By

Published : Jul 16, 2021, 7:02 AM IST

సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(TEACHERS RECRUITMENT TEST) (టీఆర్‌టీ) ఇప్పట్లో ఉండే అవకాశంలేదు. రాష్ట్ర ప్రభుత్వం 56 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు(JOB VACANCIES) చూపినా.. అందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయ ఖాళీలను(GOVERNMENT TEACHERS) చూపకపోవడం గమనార్హం. ఇప్పటికే కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు(TEACHER TRANSFERS), పదోన్నతులు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. తాజాగా కొత్త జిల్లాల పోస్టుల సంఖ్యను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ ప్రక్రియలో ఎన్ని చిక్కులు వస్తాయోనని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పట్లో టీఆర్‌టీ ఉండదని స్పష్టమవుతోంది.

ఉపాధ్యాయ ఖాళీలు లేవా?

తాజాగా మంత్రివర్గ సమావేశానికి విద్యాశాఖ ప్రతిపాదించిన ఖాళీల ప్రకారం పాఠశాల విద్యాశాఖలో 1,384 మాత్రమే చూపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యావాలంటీర్లు పనిచేస్తున్నారు. అందులో ప్రాథమిక తరగతులకు బోధించే ఎస్‌జీటీలను పక్కనబెట్టినా 6-10 తరగతులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్ల హోదాలో పనిచేసేవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. మరోవైపు కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 13 వేల వరకు ఖాళీలున్నట్లు చూపింది. ప్రధానోపాధ్యాయుల ఖాళీలను పదోన్నతిపై భర్తీ చేసినా ఇంకా 11 వేల ఖాళీలుండాలి. కానీ పాఠశాల విద్యాశాఖ 1384 ఖాళీలనే చూపింది. ఇందులో 1024 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్‌)నివే. సాధారణ టీఆర్‌టీలో వాటిని కలపరు. ఇంకా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్‌) 183, జిల్లా గ్రంథాలయ సంస్థ 150, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం 22, ప్రభుత్వ పరీక్షల విభాగంలో 5 ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో 12 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు 2016లోనే మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. 2017లో టీఆర్‌టీ ద్వారా 8,792 ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పుడు అసలు ఉపాధ్యాయ ఖాళీలను చూపకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

ఉపాధ్యాయ ఖాళీలను చూపకపోతే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మరో 5 రోజుల్లో మళ్లీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినందున ఉపాధ్యాయ ఖాళీలను చూపాలని సంఘం రాష్ట్రాధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

హేతుబద్ధీకరణ కోసమేనా?

ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి (పీటీఆర్‌) రాష్ట్రంలోని సర్కారు పాఠశాలల్లో 18గా ఉంది. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండొచ్చు. అంటే రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లలు తక్కువ.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ సైతం ఎలిమెంటరీ విద్య (1-8)లో 9,221 మంది ఉపాధ్యాయులు అవసరానికి మించి ఉన్నారని, హేతుబద్ధీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఇదీ చూడండి:HEAVY RAINS: నేడు, రేపు అతి భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details