Teachers Promotions and Transfers Schedule: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి.. 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల - తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల షెడ్యూల్
18:09 January 23
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల
తెలంగాణ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.
ఇవీ చూడండి..
ఉపాధ్యాయులకు కేసీఆర్ సంక్రాంతి కానుక.. పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌సిగ్నల్