వేతన సవరణ, వయోపరిమితి పెంపు, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తదితర సమస్యలను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంత్రి కేటీఆర్ - బదిలీలు
ఉపాధ్యాయుల పదోన్నతులు, తదితర సమస్యలను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీయూటీఎఫ్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.
ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం : కేటీఆర్
ప్రగతిభవన్లో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. టీయూటీఎఫ్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘం నేతలు తమ సమస్యలను మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించవల్సిందిగా కోరారు. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి :'డైరీ.. ఉపాధ్యాయుల సమాచార భాండాగారం'