విద్యతోనే భవిత అంటూ విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి హాజరై చదువుకోవాలని ఉపాధ్యాయులు తపించిన ఘటన ఇది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 64 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో పదో తరగతిలో ఆరుగురు విద్యార్థులున్నారు. వారిలో నవీన్ అనే విద్యార్థి కొద్ది రోజులుగా బడికి రావడంలేదు.
విద్యార్థి ఇంటి ఎదుట టీచర్ బైఠాయింపు
ఓ విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుడు ఏకంగా అతడి ఇంటి ఎదుట బైఠాయించి మరీ పాఠశాలకు తీసుకెళ్లిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. విద్య లేకపోతే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఆ విద్యార్థికి అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను ఒప్పించి ఆ బాలుడిని బడిబాట పట్టించారు.
విద్యార్థి ఇంటి ఎదుట టీచర్ బైఠాయింపు
ఆ విద్యార్థిని పాఠశాలకు రప్పించేందుకు ప్రధానోపాధ్యాయుడి సూచనతో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉదయం విద్యార్థి ఇంటికి వెళ్లారు. నవీన్ పది రోజులుగా బడికి రావడం లేదని, చదువు లేకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అతని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారు స్పందించకపోవడంతో విద్యార్థిని బడికి పంపించాలని కోరుతూ ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్ది సమయం తరవాత విద్యార్థి తల్లిదండ్రులు అంగీకరించడంతో నవీన్‌ను వెంట తీసుకుని పాఠశాలకు వెళ్లారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 21, 2022, 12:13 PM IST