Teacher promotions Postpone Telangana : ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి( National Council of Teacher Education) ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో టెట్ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Telangana Teacher promotions Postpone : ఇప్పటికే మల్టీ జోన్-1తో పాటు మల్టీ జోన్-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అది ఇక జరగకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పదోన్నతుల ప్రక్రియ(Teacher Promotion Telangana) ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.
Central Government order on Teacher Promotion: టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఈ క్రమంలో టెట్ పాసై ఉపాధ్యాయ విధుల్లో చేరినవారి సంఖ్య రాష్ట్రంలో 15 వేల మందికి ఎక్కువగా ఉండరు. కాగా అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లు అయ్యేవారు.