గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి అరబిక్ విద్యను బోధించడానికి మోతీ దర్వాజ నివాసి మహమ్మద్ సాబేర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అతను ట్యూషన్ చెప్పకుండా విద్యార్థినిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడాన్ని తల్లి గుర్తించింది. సదరు ఉపాధ్యాయుడిపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్టు - పోక్సో చట్టం
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఇంటర్ విద్యార్థినికి అరబిక్ విద్యను బోధించడానికి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కీచక టీచర్