పురపోరులో ఏపీవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా గెలిచింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహం ఫలించింది. పురపాలికలోని 36 వార్డుల్లో రెండు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగగా.. తెదేపా 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు తెదేపాకు అనుకూలంగా ఉన్నారు. వైకాపాకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరుతుంది. తెదేపా తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవటంతో తెదేపా సొంతబలం 19 అవుతుంది. ఫలితాలు వెలువడ్డాక తెదేపాకు చెందిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రులనూ జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేక శిబిరానికి తరలించారు.
సేవ్ తాడిపత్రి నినాదం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. మీ ప్రాంతాన్ని మీరే కాపాడుకోవాలంటూ ‘సేవ్ తాడిపత్రి’ అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. పోలీసులు తన వాహనాన్ని అడ్డుకున్నా.. కాలినడకన వీధుల వెంట తిరిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా సహాయకుల అండతో ప్రచారం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీకి గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అప్పుడు పట్టణంలో మొక్కలు నాటించడం, రోడ్ల నిర్మాణం, వీధులను శుభ్రం చేయించడం, వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి కొనసాగించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడినా.. తాడిపత్రిలో 1500కు పైగా మెజార్టీ వచ్చింది.
సానుభూతి పనిచేసిందా..!