తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి' - తెదేపా తెజస సీపీఐ గవర్నర్​ రాజ్​భవన్​

తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని తెదేపా, తెజస, సీపీఐ నేతలు అన్నారు. సోమవారం రాజ్​ భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ను కలిసి తాజా పరిస్థితులపై వివరించారు.

'ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి'
'ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి'

By

Published : May 4, 2020, 4:47 PM IST

రైతుల నుంచి ధాన్యం సేకరణ, కరోనా నివారణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా చేపట్టడం లేదని... తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా నేతలు ఆరోపించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత పశ్య పద్మలు... గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ను సోమవారం హైదరాబాద్​ రాజ్​ భవన్​లో కలిశారు. తాజా పరిస్థితులను గవర్నర్​కు వివరించారు.

సమాజం నానా అవస్థలు పడుతుంటే సర్కారు మాత్రం సాగునీటి టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరించడం లేదని చెప్పారు. వలస కూలీలకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?

ABOUT THE AUTHOR

...view details