తెలంగాణ

telangana

ETV Bharat / state

GORANTLA: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే పనిలో తెదేపా అధిష్ఠానం - TDP senior leaders to meet Gorantla Butchayya Chowdhary l

అలకపూనిన తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు తెదేపా నేతలు మరోమారు ఆయనతో సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నేడు ఆయనను కలవనున్నారు.

GORANTLA
GORANTLA

By

Published : Aug 20, 2021, 1:54 PM IST

ఆంధ్రప్రదేశ్ తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఆ పార్టీ సీనియర్​ నేతలు చినరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. అనుబంధ కమిటీల్లో రాజమండ్రి అర్బన్‌కు సంబంధించి గోరంట్ల సూచించిన పేర్లను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన కలత చెందారు. మూడు దశాబ్దాల పాటు రాజమండ్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అర్బన్‌ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఇటీవల జరిగిన పార్టీ అనుబంధ కమిటీల నియామకంలో అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు పేర్లను గోరంట్ల అధిష్ఠానానికి సూచించగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వర్గం పేర్లనే పార్టీ పరిగణనలోకి తీసుకోవడంతో అసంతృప్తికి లోనయ్యారని సమాచారం.

పార్టీకి ఎప్పటినుంచో పనిచేస్తున్న సీనియర్లు, మాజీ కార్పొరేటర్లు, రాజమండ్రి అర్బన్‌ ప్రాంతానికి చెందిన వారినే తాను సూచించినా.. ఏ మాత్రం పట్టించుకోకపోవటం గోరంట్లను మనోవేదనకు గురి చేసిందని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. గోరంట్ల సూచించిన పేర్లలోని వారు కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ గెలుపునకు కష్టపడిన వారేనని గుర్తు చేశారు. కేవలం గోరంట్ల వర్గం వారనే కారణంతో పార్టీ కోసం పనిచేసే వారిని ఆదిరెడ్డి వర్గం పక్కన పెట్టడం సరికాదనే వాదన వినిపిస్తోంది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఆదిరెడ్డి భవానీ ఉన్నందున తమ కోసం పార్టీ తరపున కష్టపడే వారి పేర్లను అనుబంధ కమిటీల్లో నియమించుకునే స్వేచ్ఛ కూడా ఉండదా అని ఆదిరెడ్డి వర్గం వాదన. ఇప్పటికే ఓ మారు బుచ్చయ్యచౌదరితో చర్చలు జరిపిన సీనియర్‌ నేతలు ఇవాళ మరోమారు భేటీ కానున్నారు. ఆదిరెడ్డి, గోరంట్ల వర్గాల మధ్య విభేదాలను తొలగించాలని అధిష్టానం.. నేతలకు సూచించింది.

ఇదీ చూడండి: CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details