తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారు: రావుల - తెరాస వైఖరీపై తెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి మండిపాటు

తెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి తెరాస వైఖరిపై మండిపడ్డారు. పురపాలక సంఘాల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారని విమర్శించారు.

ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారు: రావుల
ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారు: రావుల

By

Published : Dec 31, 2019, 6:56 PM IST


పురపాలక సంఘాల్లో నూతన చట్టాన్ని తీసుకొచ్చి తెరాస రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని తెదేపా సీనియర్​ నేత రావుల చంద్రశేఖర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారని విమర్శించారు. ఎలక్షన్‌ కమిషన్‌ కూడా తమ కనుసన్నుల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని రావుల ఆరోపించారు. సంక్రాంతి పండుగ పూట కుటుంబాల్లో అలజడి సృష్టించే విధంగా ఎన్నికల షెడ్యూల్​ను రూపొందించారని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడే పార్టీల గొంతునొక్కుతున్నారని రావుల మండిపడ్డారు.

ఎన్నికల సంఘాన్ని కేవలం విధులకే పరిమితం చేశారు: రావుల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details