తెలంగాణ

telangana

ETV Bharat / state

Chandrababu challegene: ప్రత్యేక హోదాపై రాజీనామాలకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా? - ap special status

Chandrababu challegene: వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పాక.. వైకాపా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై తెదేపా ఎంపీలు రాజీనామాకు సిద్ధం.. మీరు సిద్ధమా అని చంద్రబాబు సవాల్​ విసిరారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu Latest Pressmeet
చంద్రబాబు

By

Published : Dec 11, 2021, 2:26 PM IST

Chandrababu challegene: ఆంధ్రప్రదేశ్​ ప్రత్యేక హోదాపై వైకాపా నేతలు ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు ప్రజలకు ప్రత్యేక హోదా సాధిస్తామని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తామని చెప్పారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేసేందుకు తెదేపా ఎంపీలు సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు.. వైకాపా ఎంపీలు సిద్ధమా అని ప్రశ్నించారు. రాజీనామా చేయండి... కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే కలుగుతోందని చంద్రబాబు ఆక్షేపించారు. రోజురోజుకు వైకాపాపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.

వైకాపా అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని జగన్‌ అనలేదా?. ప్రత్యేక హోదా వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మంత్రి చెప్పారు. పార్లమెంటులో మంత్రి చెప్పాక ఎందుకు వైకాపా ఎంపీలు మౌనంగా ఉన్నారు.

- చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత

పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల రాష్ట్రానికి అంతా నష్టమే జరగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీచదవండి: Cds Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్​ దంపతుల అస్థికలు

ABOUT THE AUTHOR

...view details