తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సాహం... హైదరాబాద్​లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాలు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్​లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదైన ప్రభావం చూపించి మంచి జోష్ కనబరిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సాహంతో పొలిట్ బ్యూరో సమావేశాలు హైదరాబాద్​లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు ట్రస్ట్ భవన్ వేదికగా బ్యూరో సమావేశాలు జరుగనున్నాయి.

By

Published : Mar 27, 2023, 10:42 PM IST

Published : Mar 27, 2023, 10:42 PM IST

Updated : Mar 28, 2023, 6:39 AM IST

polit bereau meetings in hyderabad
హైదరాబాద్​లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశాలు

సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా సాగనున్న పొలిట్ బ్యూరో సమావేశాలు కీలకం కానున్నాయి. ప్రధానంగా తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం, పూర్వ వైభవం నినాదంతోనూ, ఏపీలో పార్టీ బలోపేతం సహా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించునున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

3నుంచి 10 అంశాలు చర్చకు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఈ నెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాలు జరగనున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు, మరో ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 32 మంది పాల్గొననున్నారు. రేపు ఉదయం సుమారు పదిన్నరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం ఇస్తున్న ఫలితాలు సహా తెలంగాణకు సంబంధించిన సుమారు ఆరు నుంచి పది అంశాలకు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

విజయోత్సాహంతో
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత విజయోత్సాహంతో ఉన్న పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహం నింపటం సహా... ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వేల ప్రజల్లోకి పార్టీని మరింతగా తీసుకురావడానికి ఏపీకి సంబంధించి సుమారు 10 నుంచి 15 అంశాలను ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. ట్రస్ట్ భవన్ వేదికగా సాగునున్న ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఏపీ తెలంగాణలో రాజకీయ అంశాలతో పాటు ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ, పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మే నెలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో ఉత్సవాలను మరింత వైభవంగా ఎన్టీఆర్ కీర్తిని చాటేలా నిర్వహించేందుకు కార్యాచరణను చంద్రబాబు నిర్దేశించనున్నట్లు సమాచారం.

పార్టీ బలోపేతానికై
రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి తెలుగు దేశాన్ని మరింత చేరువచేయటం సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించి నిర్ణయించనున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం, పూర్వ వైభవం నినాదం, ఏపీలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ట్రస్ట్ భవన్​లో జరగనున్న ఈ పొలిట్ బ్యూరో సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపటం సహా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 28, 2023, 6:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details