రాష్ట్రంలో పవర్ హాలీడే, క్రాప్ హాలీడే, ఆక్వా హాలీడేలు ముగిశాయని.. ఇక జగన్ హాలీడే తీసుకోవడమే మిగిలి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆక్వా రంగాన్ని జగన్ దగా చేశారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అసమర్ధతతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిందన్నారు. వంద కౌంట్ కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.270 ఖర్చవుతుంటే.. కనీసం రూ.200 కూడా రాక రైతులు ఆక్వా హాలీడే ప్రకటిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమన్నారు.
ఇక జగన్ హాలీడేనే మిగిలి ఉంది: నారా లోకేశ్
ఏపీలో నష్టాల వల్ల చివరికి ఆక్వా రైతులు ఆ రంగాన్ని వదిలేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విద్యుత్, దాణా ఖర్చులు పెరగటం వల్ల ఆక్వా రైతులు కూడా ఆక్వా హాలీడే ప్రకటిస్తున్నారని అన్నారు. ఇప్పటికే పవర్ హాలీడే, క్రాప్ హాలీడేలు ముగిశాయని.. ఇక జగన్ హాలీడే నే మిగిలి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇక జగన్ హాలీడేనే మిగిలి ఉంది: నారా లోకేశ్
కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వాహకులను వైకాపా నేతలు వేధిస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ 50 పైసలకే అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: