దిల్లీలో వైకాపా ఎంపీల ధర్నాపై తెదేపా ఎంపీ కేశినేని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వైకాపా ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారో ఏపీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్పై ఉన్న సీబీఐ కేసులపై త్వరగా విచారణ జరిగేలా సహకరించవచ్చు కదా అని నిలదీశారు. ఏ అంశం మీద అయినా సీబీఐ దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే... కేంద్రం ఆమోదం తెలపుతుందని... దానికి ధర్నాలు అవసరం లేదన్నది కూడా జగన్కు తెలియదా అని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారు? : ఎంపీ నాని - దిల్లీలో వైకాపా ఎంపీల దర్నా వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఎప్పుడు పోరాడతారో సీఎం జగన్ చెప్పాలని ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు రాష్ట్రం కోరితే.. కేంద్రం ఆమోదిస్తుందని... అలాంటప్పుడు ఎంపీలు ధర్నాలు చేయడమెందుకని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారు? : ఎంపీ నాని