తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నైలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో హత్యకు గురైన ఎస్సీ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరతూ.. డిసెంబర్ 19న తెదేపా నేతలు చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో రవిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా ఆదివారం రవిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.

చెన్నైలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు
చెన్నైలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు

By

Published : Jan 3, 2021, 4:57 PM IST

Updated : Jan 3, 2021, 7:59 PM IST

మూడు రోజుల క్రితం వరకు సొంత ఊరిలో ఉన్నప్పుడు పట్టించుకోని పోలీసులు.. పనిమీద పొరుగు రాష్ట్రంలో ఉంటే హడావుడి చేయడమేంటని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ప్రశ్నించారు. చెన్నైలో కడప స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్న తెదేపా నేతలను అరెస్ట్‌ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు. బెంగళూరు నుంచి చెన్నై వస్తే అంతర్జాతీయ నేరస్థుడిని పట్టుకున్నట్లు విమానాశ్రయం రన్‌వేపై పోలీసులు అరెస్ట్‌ చేశారని రవి ఆరోపించారు. కేసులు తమకేమీ కొత్త కాదని.. ప్రజల కోసం జైలుకెళ్లేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు.

కక్ష సాధింపే: చంద్రబాబు

బీటెక్‌ రవిపై కేసు నమోదు చేయడం కక్ష సాధింపులో భాగమేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఛలో పులివెందుల నిర్వహించినందునే ఆయన్ను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. అధికార బలంతో తెదేపా నేతలపై అక్రమకేసుల బనాయిస్తున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

ఇదీచదవండి:గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య

Last Updated : Jan 3, 2021, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details