భాగ్యనగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చిన ఘనత తేదేపాదేనని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సీనియర్ నేతలతో కలిసి విడుదల చేశారు. పేదప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటికి ఉచిత నల్లా, పైపులైన్ గ్యాస్ : ఎల్.రమణ - హైదరాబాద్ తాజా సమాచారం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. సీనియర్ నేతలతో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి ఇంటికి ఉచిత నల్లా, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటి ఉచిత నల్లాతో పాటు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాను అందిస్తామని తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించి, ప్రజారవాణాను మెరుగుపర్చేందుకు బీఆర్టీసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పేదలు, మహిళల ఉపాధి కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, క్రీడలకు ప్రోత్సాహం, బస్తీల అభివృద్ధి, పారిశుద్ధ్యంతో సహా పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని...ఓట్లు అడిగే అర్హత తేదేపాకే ఉందని ఎల్. రమణ పేర్కొన్నారు.