తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 9:09 AM IST

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ఏపీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన దృష్ట్యా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలు కారణం చూపుతూ.. తెదేపా నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ఏపీ చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన దృష్ట్యా చిత్తూరు, తిరుపతిలో పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబును హౌస్​ అరెస్ట్ చేశారు. చిత్తూరులో తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్‌ను, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను గృహ నిర్బంధం చేశారు. చిత్తూరు, తిరుపతిలో అర్ధరాత్రి తెదేపా నేతల ఇళ్ల వద్ద పోలీసులు నోటీసులు అంటించారు.

పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. చిత్తూరు, తిరుపతిలో తెదేపా నిరసన కార్యక్రమాలకు పార్టీ నేతలూ సిద్ధమయ్యారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా 5 వేలమందితో నిరసనకు కార్యాచరణ రూపొందించారు. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలు దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.

నిరసన తెలిపేందుకు తెదేపా శ్రేణులు సిద్ధంకాగా.. పోలీసులు పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. మరోవైపు... ఉదయం 9.45 గంటలకు చంద్రబాబు రేణిగుంట చేరుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details