Gudivada Casino Case Updates: ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఐటీ శాఖ అధికారులను కలిసి సాక్ష్యాలు అందజేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో వివాదాస్పదమైంది. అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీలు.. క్యాసినో నిర్వహణ ద్వారా వందల కోట్ల నల్లధనం చేతులు మార్చారని టీడీపీ ఆరోపించింది.
దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ.. సమాచారం సేకరణలో భాగంగా విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయానికి రావాలని టీడీపీ నేతలను కోరింది. ఇందులో భాగంగానే ఆ శాఖ కార్యాలయానికి వర్ల రామయ్య, బొండా ఉమ తదితర నేతలు వెళ్లి.. అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు.