తెలంగాణ

telangana

ETV Bharat / state

గాల్వన్​ ఘటనలో అమరులైన జవాన్​లకు తెదేపా నేతల నివాళి - జవాన్​లకు తెదేపా నేతల నివాళి వార్తలు

గాల్వన్ ఘటనలో అమరులైన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ సాయిబాబా పేర్కొన్నారు. హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లో జవాన్​లకు నివాళులు అర్పించారు. ​

Tdp Leaders tribute to Jawans who were killed during the Galvan event
గాల్వన్​ ఘటనలో అమరులైన జవాన్​లకు తెదేపా నేతల నివాళి

By

Published : Jun 18, 2020, 4:06 PM IST

గాల్వన్​ ఘటనలో వీరమరణం పొందిన జవాన్​ల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ సాయిబాబా పేర్కొన్నారు. హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​రోడ్స్​​లో తెదేపా ఆధ్వర్యంలో సైనికులకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సైనికుల కుటుంబాలకు దేశ ప్రజలంతా అండగా నిలుస్తారని సాయిబాబా పేర్కొన్నారు. చైనా దురాగతాలను తిప్పికొట్టడానికి సరైన సమయం కోసం దేశం ఎదురు చూస్తోందని అన్నారు. సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: అమరజవాన్లకు సంఘీభావంగా భాజపా​ ర్యాలీల వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details