ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో తెదేపా నేతలకు చెందిన మూడు ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచే ఇళ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని... అందుకే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నాయకులు వాదించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కొందరు నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.
నెల్లూరులో తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత.. ఉద్రిక్తత
ఏపీలోని నెల్లూరులో కొందరు తెదేపా నేతలకు చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ వీటిని తొలగించారు. అడ్డుకున్న తెదేపా నేతలను అరెస్ట్ చేశారు.
నెల్లూరులో ఉద్రిక్తత... తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత