సొంతబిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలని ఏపీకి చెందిన తెదేపా సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదనే అచ్చెన్నను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పెళ్లికి వెళ్లిన యనమల, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని.. తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులని చినరాజప్ప చెప్పారు.
'పెళ్లికి వెళ్లినా.. కేసులు పెట్టడమేంటి' - జగన్‌పై చినరాజప్ప కామెంట్స్
పెళ్లికి వెళ్లినందుకు తమపై కేసులు పెట్టడం జగన్ సర్కారు అరాచకానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా సీనియర్ నేత చినరాజప్ప ఆరోపించారు. తనతో పాటు మరో సీనియర్ నేత యనమలపైనా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాసనసభలో గట్టిగా గళం వినిపిస్తారనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు.
పెళ్లికి వెళ్లినా.. కేసులు పెట్టడమేంటి?: చినరాజప్ప
TAGGED:
జగన్‌పై చినరాజప్ప కామెంట్స్