ఏపీలోని కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజనిర్ధరణ నిమిత్తం బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా అరెస్టు చేశారు. వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు.. పార్టీ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకుని.. వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
Kondapalli: కొండపల్లికి వెళ్లకుండా.. తెదేపా నేతల అరెస్ట్.. - తెదేపా నిజనిర్థరణ కమిటీ
ఏపీ తెదేపా నేతలను ఆ రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధరణ చేసేందుకు బయల్దేరిన నేతలను.. బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
కొండపల్లి
పోలీసుల తీరును నేతలంతా తప్పుబట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పు జరగకుంటే.. తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై.. అక్రమ మైనింగ్ పై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
ఇదీ చూడండి:Chandrababu: 'మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'