Yarapathineni comments on YCP leaders: పరదాల చాటున తిరిగే ఏపీ సీఎంను చూసి రెచ్చిపోతున్న వైకాపా నేతలు రేపటి పరిస్థితి ఏంటో గ్రహిస్తున్నారా అని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. పతనం అంచున ఉన్నారు కాబట్టే ఏం చేయాలో అర్థంకాక.. దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా నాయకులు పదేపదే పరుష పదజాలంతో దూషించడాన్ని.. ఆయన ఖండించారు. లోకేశ్ పట్ల భయంతోనే నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. లోకేశ్ అంటే ఆ మాత్రం భయం వైకాపా నేతల్లో ఉండాలన్నారు.
1989-1994 మధ్య జరిగిన అరాచకాల ఫలితం ఓ నిశబ్ద విప్లవమైందని ఎద్దేవా చేశారు. అదే నిశబ్ద విప్లవం తిరిగి పునరావృతం కానుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో,.. ఎవరిని ఎలా పాతరేయాలో అన్నింటికీ సిద్దపడి ఉన్నామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిపారు.