తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తేదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశం వల్ల ఎలాంటి ఫలితం లేదన్నారు.
జలవివాదాలు త్వరగా పరిష్కరించాలి: రావుల - Ravula comments on Apex council meeting
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను త్వరగా పరిష్కరించాలని తేదేపా పోలిట్ బ్యూరోసభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశం ఆశాజనకంగా లేదన్నారు.
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు త్వరగా పరిష్కరించాలి: రావుల
ఇలాంటి సమావేశాల వల్ల కొంత వరకు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులను కొత్త వాటిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించటం సరికాదన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన బోర్డులను పునర్ వ్యవస్థీకరించాలని అన్నారు. రాష్ట్రాల పరిధులను నిర్ణయించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.