TDP leader Ravula Chandrasekhar Reddy joining BRS: హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రగతి భవన్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి(Ravula Chandra Sekhar Reddy) ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎన్నో సందర్భాల్లో కలిసి వేదికలు పంచుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ అవన్ని పునరావృతం కావాలని.. భవిష్యత్‌లో గొప్పగా కలిసి పనిచేసేయాలని కోరారు. చంద్రశేఖర్, తన అనుచరులను పార్టీలోకి వచ్చినందుకు స్వాగతం పలికారు. తమ రాకతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వంద ఏనుగుల బలం వచ్చిందని ప్రశంసించారు.
KTR Reaction on Ravula Join in BRS: కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండుసార్లురుణమాఫీచేశామని చెప్పారు. ఎన్నికలు జరిగేలోపు మిగిలిన అందరికి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 13 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi) ఇచ్చామని గుర్తు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ వైద్యశాల లేకపోతే.. ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. గురుకులాల్లో 6.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్(BRS) గెలిస్తే.. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు.
KTR Speech at Karimnagar BRS Meeting : 'అవసరమైతే.. TSPSCని ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం'
Minister KTR Comments on Congress: 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్(KTR) ప్రశ్నించారు. పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. ఒకప్పుడు వలసలకు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇవాళ ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందని తెలిపారు. సముద్రతీరం లేకుండా మత్స్య సంపద పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే నంబర్‌వన్ స్థానమని అన్నారు.