తెలంగాణ

telangana

ETV Bharat / state

లోకేశ్ 'యువగళం' పాదయాత్ర రూట్​ మ్యాప్​ ఖరారు..

LOKESH PADAYATRA ROUTE MAP : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టనున్న యువ గళం మహా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్​లోని కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభిస్తారు.

LOKESH PADAYATRA ROUTE MAP
లోకేష్​ 'యువగళం' పాదయాత్ర రూట్​ మ్యాప్

By

Published : Jan 13, 2023, 3:28 PM IST

NARA LOKESH PADAYATRA ROUTE MAP : ఆంధ్రప్రదేశ్​లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగమే ఎజెండాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్న సంగతి విధితమే. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున.. 400 రోజులు.. 4,000 కిలోమీటర్లు యాత్ర చేయనున్నారు. అయితే కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగనున్న ఈ పాదయాత్ర రూట్​ మ్యాప్​ విషయంలో సందిగ్ధత నెలకొంది. తాజాగా ఆ గందరగోళానికి తెరదించుతూ లోకేశ్​ యువగళం మహా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు.

లోకేష్​ 'యువగళం' పాదయాత్ర రూట్​ మ్యాప్

ఎప్పుడు మొదలవుతుందంటే : ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి 3 రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తొలి రోజు పాదయాత్ర వివరాలు: వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఓల్డ్‌ పేట్‌ మసీదులో ప్రార్థనలు చేసి ముస్లీం మైనారిటీ నేతలతో లోకేశ్‌ సమావేశం అవుతారు. కుప్పం బస్టాండ్‌, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ జంక్షన్‌, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్‌ రోడ్​, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్‌ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది.

ఈ నెల 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈ నెల 29న అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో మూడు రోజుల పాటు 29 కిలోమీటర్ల మేర లోకేశ్​ పాదయాత్ర సాగనుంది.

జీవో నెం.1 రద్దు చేయాలి..: రాష్ట్ర ప్రభుత్వం సభలు, ర్యాలీలు నిషేధిస్తూ జీవో నెంబర్​ 1ను తీసుకొచ్చింది. ర్యాలీలు బహిరంగ సభలు చేపట్టాలంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ జీవోలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. చీకటి జీవో తెచ్చి ప్రజల సమస్యలు తీర్చడానికి వీలు లేకుండా చేశారని ఆగ్రహించారు. జీవో రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 23 వరకు జీవోను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోపై తదుపరి ఆదేశాలు 23 తర్వాత వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

పోలీసులు పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తారా: హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. లోకేశ్​ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తారేమో అనే గందరగోళం టీడీపీ శ్రేణుల్లో కాస్తా కలవరం రేపుతోంది. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. పాదయాత్రపై ఏలాంటి నిర్ణయాలు తీసుకుంటదనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details